ఒకప్పుడు క్రొయేషియా ప్రజల జీవనం చాలా దుర్భరం. స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటం కారణంగా తుపాకుల శబ్దాలతో తెల్లారి.. బాంబుల మోతలతో అక్కడి ప్రజలకు రోజు గడిచేది. బయట అడుగుపెడితే ప్రాణాలతో తిరిగి ఇంటికి చేరతారో లేదో తెలీదు.
ఇలాంటి పరిస్థితుల్లోనూ చాలామంది కుర్రాళ్లు ఫుట్‌బాల్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. దాన్నే జీవితం అనుకున్నారు. ఎంతటి కష్టనష్టాలు ఎదురైనా ఓర్చుకున్నారు. సరైన వసతులు లేకపోయినా వెనకడగు వేయలేదు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ఆట ఆడారు. అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచ విజేతలుగా నిలిచేందుకు అడుగు దూరంలో నిలిచారు. దేశంలో కల్లోల పరిస్థితుల్ని తట్టుకుని నిలిచిన మనో నిబ్బరమే ఇప్పుడు వాళ్లను ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఈ స్థాయి దాకా తెచ్చింది!